ముఖంపై నల్ల మచ్చలా... ఓ చక్కని చిట్కా ఉంది...
నగుమోముపై నల్లమచ్చలుంటే... అమ్మో ఇంకేమైనా ఉందా? ఎంత తలవంపు అని యువత తల్లడిల్లిపోతుంటారు. చందమామకే మచ్చ ఉంది... మనకెంత అని వదిలేయలేం కదా. ఈ నల్లమచ్చలు మాయం కావాలంటే... ఓ చక్కని చిట్కా ఇది. దాల్చిన చెక్కను మెత్తగా పౌడరులా చేయం
నగుమోముపై నల్లమచ్చలుంటే... అమ్మో ఇంకేమైనా ఉందా? ఎంత తలవంపు అని యువత తల్లడిల్లిపోతుంటారు. చందమామకే మచ్చ ఉంది... మనకెంత అని వదిలేయలేం కదా. ఈ నల్లమచ్చలు మాయం కావాలంటే... ఓ చక్కని చిట్కా ఇది. దాల్చిన చెక్కను మెత్తగా పౌడరులా చేయండి. ఆ పొడిని ఒక గాజు పాత్రలో్ వేసి, అందులో కొంచెం తేనె కలపండి.
మెత్తగా పేస్టులా తయారుచేయండి. కొంచెం నిమ్మరసం, పసుపు దానికి కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి... ముఖ్యంగా నల్ల మచ్చలున్నచోట పట్టించి... సున్నితంగా మర్దనా చేయండి. రాత్రి ఈ దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని, ఉదయంకల్లా గోరువెచ్చని నీటితో కడిగేయండి. నల్లమచ్చలు మూడో రోజే తగ్గడం, మరికొద్ది రోజులకు కనుమరుగవడం మీరు గమనిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమికల్స్ కలిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన పనిలేదు.