కొందరైతే ఎప్పుడూ చూసిన మేకప్ వేసుకునే ఉంటారు. అలాంటివారికి ఒక్కరోజు మేకప్ లేకపోయినా ఎంతో కష్టంగా ఉంటుంది. అంతేకాదు వారి అందాన్ని రెట్టింపు చేయకపోగా లేనిపోని చికాకులు తెచ్చిపెడుతుంది. అలానే లిప్‌స్టిక్, కాటుక, మేకప్ పౌడర్ రోజూ వాడడం వలన కొన్నిసార్లు చర్మానికి హాని కలుగుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు.. మేకప్ లేకుండానే.. సహజంగా అందాన్ని పొందడం ఎలా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
ముఖం పొడిబారినట్లు కనిపిస్తుంటే.. టోనర్ ఉపయోగించాలి. ఈ టోనర్ వాడడం వలన చర్మం పీహెచ్‌లో మార్పులను నివారిస్తుంది. దాంతోపాటు చర్మానికి జీవాన్నిస్తుంది. కనుక చర్మం పొడిబారినట్టుగా ఉన్నా.. లేదా కనిపించినా టోనర్ ఉపయోగించండి తప్పక ఫలితం ఉంటుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు వేడినీళ్లల్లో నిమ్మరసం కలుపుకుని తాగుతుండాలి. నిమ్మరసంలోని మలినాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫంగల్ వంటి ఖనిజాలు చర్మానికి మంచి తాజాదనాన్ని చేకూర్చుతాయి.
చాలామందికి ముఖం మీద మృతుకణాలు ఉండడం వలన స్వేదగ్రంథులు మూసుకుపోయి చర్మం నీరసంగా, డల్‌గా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు స్క్రబ్బర్‌ను వాడొచ్చు. ఇలా స్క్రబ్బర్‌ను ఉపయోగిస్తూ మీ చర్మం తత్వాన్ని బట్టి వారంలో రెండు లేదా మూడుసార్లు మృతుకణాలను తొలగించుకోవచ్చును.