Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖంపై మొటిమలు ఎందుకు వస్తాయి.. వాటి నిర్మూలన ఎలా?

Advertiesment
Pimples
, గురువారం, 31 డిశెంబరు 2015 (15:25 IST)
కాలుష్యం, హార్మోన్‌లలో మార్పులు వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. టీనేజర్స్‌లో ముఖ్యంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర సాధారణ చర్మ సమస్య ఇలా చాలానే ఉన్నాయి. మొటిమలు తగ్గడానికి మనం ఏవేవో క్రీములను వాడుతుంటాం. అయితే సమస్యకు నివారించేందుకు ప్రయత్నించినా అవి మరింత ఎక్కువ అవుతుంటాయి. క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు, ఫేస్‌మాస్క్‌లతో నివారించని కొన్నిచర్మ సమస్యలు, మొటిమలు మనం తీసుకొనే ఆహారంతో తొలగిపోతాయి. అందువల్ల చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి కొన్ని చిట్కాలను మీకోసం...
 
* ముఖాన్ని మూడు పూటలా సబ్బుతో కడుక్కోవాలి. ఇంట్లో తరుచూ దొరికే పండ్లుతోటి, వెజిటేబుల్స్ తోటి చర్మానికి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. 
ఎప్పుడూ మీ చర్మానికి ఉపయోగించే మాస్క్‌లు, ఫేషియల్స్, స్క్రబ్బింగ్లు, సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని మరీ వాడడం మంచిది. జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటే నూనె, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. మొటిమలను గిల్లడం, గోకడం వంటివి చేయకూడదు.
 
* ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతమంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటాక్సీన్స్ చెడు చెమట, మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడి శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది. మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ప్రాణయామం, యోగా చేస్తే మంచిది.
 
* ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి. 
ఫ్యాట్, నూనె పదార్థాలు, మసాలాలను లేకుండా కనీసం వారంలో రెండు రోజుల పాటు డైట్‌ను పాటించండి. ఇవేకాక, సున్నిపిండితో ముఖం కడుక్కోవడం, క్రీమ్‌ల వాడకం తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం వంటి ఆరోగ్య నియమాలు పాటిస్తే కొంత వరకు చర్మంపైన కలిగే మొటిమల ప్రభావాన్ని తగ్గించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu