వేసవిలో చెమట వాసనతో బాధపడుతున్నారా... అందుకు బిల్వ ఆకులు తీసుకుంటే...
చెమట వాసనకు ఉండలేనివారు బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని
Publish Date: Thu, 21 Jun 2018 (12:37 IST)
Updated Date: Thu, 21 Jun 2018 (12:38 IST)
చెమట వాసనకు ఉండలేనివారు బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టులా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ఇక జుట్టు మృదువుగా ఉండాలంటే కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్, ఉసిరిపొడి తీసుకుని ఒక పాత్రలో వేసుకుని కలుపుకున్న తరువాత ఆ మిశ్రమానికి టీ ఆకులు, బీట్‌రూట్ తరుగు వేసి కాటిన నీటిని అందులో కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారు చేసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.
Kowsalya
Publish Date: Thu, 21 Jun 2018 (12:37 IST)
Updated Date: Thu, 21 Jun 2018 (12:38 IST)