Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫెయిర్ నెస్ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా?

Advertiesment
Fairness cream side effects
, బుధవారం, 3 సెప్టెంబరు 2014 (16:46 IST)
మహిళలు అందంగా ఉండేందుకు ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ, ఎక్కువ కాలం ఫెయిర్ నెస్ క్రీమ్ వాడటం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఫెయిర్ నెస్ క్రీమ్‌ల ద్వారా మొదట చర్మం ఇన్ఫెక్షన్‌తో ప్రారంభమై హానికరమైన స్కిన్ క్యాన్సర్ వరకూ దారితీస్తుంది.
 
ఫెయిర్ నెస్ క్రీమ్‌లతో అలెర్జీ సమస్యలు వస్తాయి. ఇవి కొందరి చర్మ తత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఎంపిక చేసుకునేందుకు ముందే చర్మానికి అనుకూలమైన క్రీమ్‌లను సెలెక్ట్ చేసుకోవాలి.  
 
ఫెయిర్ నెస్ క్రీమ్‌లలో రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అలర్జీలు మొదలై స్కిన్ ఇరిటేషన్, రెడ్ నెస్, దురద మరియు తీవ్ర సమస్యలను గురిచేస్తుంది, ఇది ఓయిడీమాకు కారణం అవుతుంది. కాబట్టి, ఎటువంటి అలర్జీ లక్షణాలు లేనటువంటి క్రీమ్ లను ఎంపిక చేసుకోవాలి.
 
చర్మానికి ఫర్ ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఫెయిర్ నెస్ క్రీములను ఎంపిక చేసుకోవాలి. లేదంటే చర్మం పొడి బారడం లేదా పాలిపోవడం జరుగుతుంది. అలాగే ఎంపిక చేసుకొనే క్రీములు మరీ ఆయిలీగా ఉన్నట్లైతే, చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. ఇది మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. 
 
ఇది మనకు తెలియకుండానే మన హానికలిగించే దుష్ప్రభావం కలిగిస్తుంది. దీని ప్రభావం వల్ల చర్మం మీద ఎక్స్ ట్రా మార్క్స్ మరియు స్కార్స్ ఏర్పడుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరాన్ని బట్టే ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడాలని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu