"శాటిన్ ఫినిష్" ఉత్పత్తుల్ని ఆయిల్ స్కిన్ వాళ్లు వాడొచ్చా..?
* నూనెతో కూడిన మాయిశ్చరైజర్లు, గాఢత కలిగిన ఆల్కాహాల్‌తో కూడిన ఉత్పత్తులు, శాటిన్ ఫినిష్‌తో ఉన్న, మరింత మృదుత్వం కోసం తయారైన ఉత్పత్తులు మొదలైనవి ఆయిల్ స్కిన్ వాళ్లు వాడకూడదు. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవటం. అందుకనే రోజూ రెండుసార్లు గోరువెచ్చని నీటితో, నాణ్యతగల సోపుతో స్నానం చేయాలి.* ఆహార పదార్ధాల్లో తీపి, కొవ్వు, ఉప్పు మొదలైనవాటిని తగ్గించాలి. బి2 విటమిన్ ఉన్న ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్‌లేని క్రీములు, మాయిశ్చరైజర్లను వాడాలి. సౌందర్య ఉత్పత్తుల లేబుల్‌లో కమాడోజెనిక్, నాన్ ఎక్న్‌జెనిక్, యాంటీబాక్టీరియల్ అని ఉన్నవాటినే కొనాలి. టీట్రీ, గ్రేప్ ఫ్రూట్, చమోమిల్ మొదలైన సౌందర్య ఉత్పత్తులు ఆయిల్ స్కిన్ వారికి తగిన ఉత్పత్తులు.