Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకప్ వేసుకోగానే సరిపోదు.. చక్కగా అతికినట్లుండాలి..!!

Advertiesment
సౌందర్యం
FILE
* మేకప్‌లో ఫౌండేషన్ కీలకపాత్ర వహిస్తుంది. హడావుడిలో ఏదో ఒకటిరాసుకుంటే ముఖంలోని లోపాలు, ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే చర్మతత్వానికి దగ్గరగా ఉన్న మూడు రంగుల్ని ఎంచుకోవాలి. చెక్కిళ్లపై కొద్దిగా రాసుకుని చూసి, చర్మతత్వానికి సరిపడే రంగును ఎంపిక చేసుకోవాలి.

* హడావుడిగా ఉంటూ కేక్ ఫౌండేషన్‌ను ఎంచుకున్నట్లయితే సమస్య తప్పకపోవచ్చు. ఎందుకంటే అది అద్దినట్లు కనిపిస్తుంది. కాబట్టి లిక్విడ్ ఫౌండేషన్ రాసుకుంటే సరిపోతుంది. ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాత ఫౌండేషన్ రాసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.

* ముఖంపై మొటిమలు, మచ్చలు, కళ్లకింది నల్లటి వలయాలను కప్పిపుచ్చుకునేందుకు చాలామంది ఫౌండేషన్‌ను మందంగా రాసుకుంటుంటారు. అయితే దీనివల్ల అనుకున్న ఫలితం రాదు. కాబట్టి అలాంటివారు ఇకమీదట కన్సీలర్‌ను వాడిచూస్తే తేడా ఇట్టే అర్థమవుతుంది. చిన్న మొటిమను కనిపించకుండా చేయాలంటే, ఫౌండేషన్‌కు బదులుగా ముందు కన్సీలర్ వాడాలి. ముడతలు కనిపించకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్, ఫౌండేషన్‌లను కలిపి రాసుకుంటే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu