అధరాల సౌందర్యం కోసం ఏం చేయాలి..!?
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2012 (17:18 IST)
ప్రతిరోజూ లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలకు వెన్నతో మసాజ్ చేయాలి. పగిలిన పెదాలకు వెన్నతో మసాజ్ చేయాలి. పగిలిన పెదాలకు లిప్‌స్టిక్ బాగుండదు. లిప్‌స్టిక్ ఎంతవరకు వేసుకోవాలో లైనర్‌తో మార్క్ చేసుకోవాలి. పెదవులు లావుగా వున్నట్లైతే కాస్త లోపలి వైపు గీత గీసి డార్క్ కలర్ షేడ్ చేసి లోపలి భాగం లైట్ కలర్‌తో నింపాలి. అక్కడ కొద్దిగా పౌడర్ అద్ది మళ్ళీ మొదట చేసిన విధంగా చేయండి. పెదవులు సన్నగా వుంటే కాస్తపైకి మార్క్ చేసుకుని ముందు డార్క్ కలర్ షేడ్ చేసిన తర్వాత లైట్ కలర్ వేయండి. ప్రతి ఒక్కరికీ డార్క్ షేడ్, రెడ్, మెరూన్, బ్రౌన్ కలర్స్ బాగుంటాయి. ఇతర కలర్స్, డ్రస్‌కు అయ్యే కలర్స్ నప్పనవి గుర్తుంచుకోండి. కలర్స్ వేసుకున్న తర్వాత లిప్ గ్లాస్ రాయండి.