Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

kamal - trump

బిబిసి

, మంగళవారం, 5 నవంబరు 2024 (22:11 IST)
అమెరికా ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఏడు స్వింగ్ రాష్ట్రాలతోపాటు న్యూయార్క్, ఇండియానా, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, లూసియానా, మేరీలాండ్, మస్సాచుసెట్స్, మిస్సోరి, రోథె ఐలాండ్, దక్షిణ కరోలినా, వాషింగ్టన్ డీసీ సహా మొత్తం 50 రాష్ట్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అబార్షన్ హక్కులను హారిస్ సమర్థిస్తున్నారు. ఆహార పదార్థాల రేట్ల తగ్గింపు, ఇళ్ల కొరతను తగ్గించడం వంటి హామీలను ఆమె ఇచ్చారు. ట్రిలియన్ల విలువైన పన్నుల తగ్గిస్తానని ట్రంప్ ప్రచారం చేశారు. డోనల్డ్ ట్రంప్ వయసు 78 ఏళ్లు కాగా, కమలా హారిస్ వయసు 60 ఏళ్లు.
 
పోటాపోటీ హామీలు
‘‘మీ గొంతులు వినిపించే సమయమిది’’ అని కమలా హారిస్ పోలింగ్ మొదలైన కాసేపటికి ట్వీట్ చేశారు. బయటకు వచ్చి ఓటువేసి అందరం కలిసికట్టుగా ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ చేయాలని పోలింగ్‌కు మూడు గంటల ముందు ట్రంప్ తన సోషల్ ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టుచేశారు. మనం మళ్లీ వెనక్కి వెళ్లకూడదని హారిస్ అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు ఆర్థిక ప్రణాళికను ఆమె ప్రకటించారు. అమెరికాలో ఇళ్ల కొరతకు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు.
 
జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలిగిన నెల తర్వాత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో చేసిన ప్రసంగం హారిస్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైనది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడిన వెంటనే ట్రంప్ ముఖంపై రక్తపు మరకతో పిడికిలి బిగించి కనిపించడం ఆయన ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశం. అక్రమవలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దులను మూసివేస్తానని ట్రంప్ ప్రకటించారు.
 
ఇక పోలింగ్ ప్రారంభమైన దగ్గరినుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల ఓటర్ల క్యూ లైన్లలో కాఫీ కప్పులతో కనిపించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు హవాయి, అలస్కా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024