Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాస్తా, పిజ్జాతో నిద్రలేమి తప్పదండోయ్!

Advertiesment
healthy eating tips: foods you shouldn't eat before bed
, శుక్రవారం, 23 జనవరి 2015 (15:45 IST)
ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటేనే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫాస్ట్ పుడ్‌కు సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రలేమికి దారి తీస్తుంది. కాబట్టి నిద్రపోయేముందు పాస్తా వద్దే వద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
అలాగే పెద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జాలు కూడా నిద్రాభంగం కలిగిస్తాయి. రాత్రుల్లో తీసుకుంటే, నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా మెల్లగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది.
 
పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది. నూనెలతో తయారు చేయడం వల్ల గుండెకు ప్రమాదం తప్పదమని.. దీంతో హార్ట్ బర్న్‌కు కారణమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం షుగర్ క్యాండీల్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. జంక్ ఫుడ్స్‌ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్, లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu