సునాముఖిని సీమ నేలతంగేడాకు అని అంటారు. సునాముఖి సర్వరోగాలను జయించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేయబడింది. సునాముఖితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఒక కప్పు వేడి పాలలో సునాముఖి చూర్ణం 3 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తుంటే పురుషులకు శారీరకబలం, శక్తి వస్తుంది.
రోజూ రెండు పూటలా సునాముఖి చూర్ణం 3 గ్రాములు అరకప్పు ఆవుపాలలో కలిపి తాగితే రక్తం శుభ్రపడి, కొత్తరక్తం పుడుతుంది. చింతాకు రసం 30 గ్రాములు, సునాముఖి పొడి 3 గ్రాములు కలిపి నిద్రించే ముందు తాగితే ఉదయం సుఖవిరేచనం జరుగుతుంది. దోసగింజల రసం 30 గ్రాములు, సునాముఖి పొడి 2 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తుంటే మూత్రనాళంలో రాళ్లు కరుగుతాయి.
మూడు గ్రాముల సునాముఖి పొడిని చెంచా నెయ్యి కలిపి తిని వెంటనే రెండు ఖర్జూరాలు తింటే దంత పుష్టి కలుగుతుంది.
యాభై గ్రాముల దానిమ్మ రసానికి 3 గ్రాముల సునాముఖి కలిపి నిద్రించే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. సునాముఖి 2 గ్రాములు, తేనె 10 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తుంటే క్రమంగా శరీరమంతా ఉక్కులా గట్టిపడి మహాబలశాలి అవుతారు.