Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా చేస్తే శరీరం దేనికీ పనికిరాదు.. అందుకే ఈ చిట్కాలు...

Advertiesment
అలా చేస్తే శరీరం దేనికీ పనికిరాదు.. అందుకే ఈ చిట్కాలు...
, గురువారం, 24 జనవరి 2019 (12:21 IST)
ఇప్పుటి కాలంలో ఏ చిన్న అనారోగ్య సమస్య ఎదురైనా వెంటనే ఆసుపత్రికి లేదా మెడికల్‌ షాపుకి వెళ్లి మందులు, ఏవేవో మాత్రలు తెచ్చుకుంటారు. అది ఒకరోజుకైతే పర్వాలేదు కానీ.. కొన్ని వారాలు, నెలలు పాటు వాడితే శరీరం దేనిని పనికిరాదు. శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చిన దానిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే ఏ మందులు, మాత్రలు అవసరం మనకుండదు. అందుకు ముందుగా ఏం చేయాలంటే.. మంచి పుష్టికరమైన ఆహారాన్ని భుజించాలి. అలాంటి వాటిల్లో ఈ కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం...
 
1. చింతపండు చారు వాత రోగాలను దరిచేరకుండా చేస్తుంది. జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. పెసలను పద్నాలుగు రెట్ల నీటిలో వేసి బాగా ఉడికించి తాలింపుచేస్తే పెసరకట్టు అవుతుంది. ఇది మంచి బలాన్నిస్తుంది. సులువుగా జీర్ణమవుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది.
 
2. ఉలవచారు మూలవ్యాధిని తగ్గిస్తుంది. కఫ, వాత వ్యాధులను నివారిస్తుంది. శెనగకట్టు పైత్య, కఫ రోగాలను నివారిస్తుంది. అడవి పెసలతో చేసిన కట్టు పైత్య, శ్లేష్మవ్యాధులను అరికడుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. తరచుగా వచ్చే పొడి దగ్గును తగ్గిస్తుంది. 
 
3. చిన్న శెనగలతో చేసిన కట్టు శరీరానికి పుష్టి కలిగిస్తుంది. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుతుంది. కందికట్టు వాతవ్యాధులను త్వరగా నివారిస్తుంది. పైత్యం, కఫం, జ్వరం, మొలలను అరికడుతుంది.
 
4. మినపప్పు, అలచందపప్పు వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వాత వ్యాధులను హరించి, మంచి బలాన్ని చేకూరుస్తాయి. అనుముల పప్పు రక్తపిత్తమును తగ్గిస్తుంది. స్త్రీలలో పాలనువృద్ధి చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోంపు గింజలు తింటే.. ఏమవుతుంది..?