అవునండి.. దాల్చిన చెక్క కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మసాలా పదార్థాల్లో ఒకటైన దాల్చిన చెక్కను కేకుల్లో, కాఫీల్లో ఎక్కువ వాడుతాం. ఇది అల్జీమర్ వ్యాధిని దరిచేరనివ్వదు. అంతేగాకుండా క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని కలిగివుంటుంది.
దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ పనితీరూ బాగుంటుంది. జలుబూ, దగ్గూలాంటి ఇన్ఫెక్షన్ల సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
ఇంకా మొటిమల్ని నివారించడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, బరువును తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.