ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు.. మజ్జిగలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే..
మిరియాల్లో పోషకాలు పుష్కలం. చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం
మిరియాల్లో పోషకాలు పుష్కలం. చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం చేస్తాయి.
ఒక గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి.
వేసవిలో అధిక దాహం ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.