మామిడి చెక్క చూర్ణంతో ఒబిసిటీ పరార్..
మామిడి చెక్క లేదా మామిడి టెంకలోని పప్పు చూర్ణంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల కడుపులోకి నులిపురుగులను నశింపజేసే శక్తి మామిడి టెంక చూర్ణానికి వుంది.
మామిడి చెక్క లేదా మామిడి టెంకలోని పప్పు చూర్ణంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల కడుపులోకి నులిపురుగులను నశింపజేసే శక్తి మామిడి టెంక చూర్ణానికి వుంది.
అతి తక్కువ మోతాదులో మామిడి టెంకలోపలి పప్పుని పంచదార కలిపి పిల్లలకు పెట్టడం ద్వారా కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. ఇంకా ఈ మామిడి టెంకలో విటమిన్ ఎ, ఇ, ఇంకా ఐరన్‌లు అధికంగా ఉంటాయి. మామిడి టెంక చూర్ణం ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మామిడి టెంక చూర్ణంలోని యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మామిడిచూర్ణం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. మామిడిపండులో విటమిన్ ఎ,సి,డి,బి6లు శరీరానికి హానికలిగించే విషతుల్యాలను తొలిగిస్తాయి.
హృద్రోగ సమస్యలు నివారించే ఆయుర్వేద ఔషధాల్లో మామిడి చూర్ణాన్ని వాడుతారు. ఇది గుండెకు మేలు చేస్తుంది. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులను మామిడిచూర్ణం నివారిస్తుంది.
అలాగే మామిడి చెక్క, కరక్కాయతో కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఉదయం సాయంత్రం రోజూ రెండుపూటలా తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది
మామిడి టెంకలోని జీడిని ఎక్కువ మోతాదులో ఒకేసారి నోట్లో వేసుకోకూడదు. తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే మామిడి జీడిని కొద్ది మోతాదులో పంచదార కలిపి పెడితే తక్షణం ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.