Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-01-2023 నుంచి 14-01-2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
Astrology
, శనివారం, 7 జనవరి 2023 (10:15 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రముఖులను ఆకట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రులను వేడుకకు ఆహ్వానిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు చక్కని ఫలితాన్నిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆది, బుధ వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. అపరిచితులను నమ్మవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు బలవడతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శనివారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్థానచలనం. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఆధ్యాత్మికత పెంపొండుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతికి చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుక్నునది సాధిస్తారు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆది, గురు వారాల్లో అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అనుకూలతలున్నాయి. సమర్ధతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ధనసమస్యలు కొలిక్కి వస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులకు కానుకలు అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. బంధుమిత్రుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం నిదాననంగా అందుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. బుధ, గురు వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిరుద్యోగులకు శుభయోగం. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పర్మిట్లు, లైసెన్సులు మంజూరవుతాయి. సంతానం విదేశీయాన యత్నం ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదా మార్పు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ పై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో వ్యవహరించండి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-01-2023 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం..