Publish Date: Tue, 19 Apr 2016 (18:53 IST)
Updated Date: Tue, 19 Apr 2016 (18:57 IST)
ఎస్. భరత్- రాజమండ్రి: మీరు తదియ బుధవారం కర్కాటక లగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. కళత్ర కారకుడైన శుక్రుడు కుజునితో కలయిక వల్ల కుటుంబీకులతో సరదాగా ఉండటం, క్షణికోద్రేకం లేకుండా ఉండటం మీకు చాలా ముఖ్యం. ప్రతీ రోజు లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
2014 అక్టోబరు నుంచి రవి మహర్ధశ ప్రారంభమైంది. ఈ రవి 2016 అక్టోబర్ నుంచి 2020 వరకు యోగాన్ని ఇస్తాడు. తదుపరి చంద్ర మహర్థశ 10 సంవత్సరములు మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాల్లో బొప్పాయి చెట్టును నాటినట్లైతే మీకు నరఘోష తొలగిపోతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.