Publish Date: Wed, 03 Feb 2016 (14:40 IST)
Updated Date: Wed, 03 Feb 2016 (14:43 IST)
వెంకటసూర్య మంగలక్ష్మీ-అమలాపురం: మీ కుమార్తె వై.సౌజన్య చవితి మంగళవారం, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. రాజ్యము నందు బుధ, కుజులు ఉండటం వల్ల టెక్నికల్, ఎంబీఎ వంటి రంగాల పట్ల ఏకాగ్రత వహించిన బాగుగా రాణిస్తారు. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడు పితృకారకుడైన రవితో కలయిక వల్ల ఆమె తండ్రిగారికి 2017 నుంచి బాగుగా కలిసిరాగలదు. ఆమెకు విషధారా కాలసర్పదోషం ఉన్నందువల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. శుభం కలుగుతుంది. 23 లేక 24 సంవత్సరము నందు కార్పొరేట్ సంస్థల యందు బాగుగా స్థిరపడతారు.
24 లేక 25 సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు. 2024 నుంచి శని మహర్దశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. శారదా దేవిని పూజించి, ఆరాధించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. దేవాలయంలో అరటి చెట్టును నాటిన పురోభివృద్ధి కానవస్తుంది.
మీ కుమార్తె వై.జ్వాలాశ్రీ తదియ సోమవారం, మీన లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యము, అభివృద్ధి, స్థిరబుద్ధి చేకూరుతుంది. రాజ్యస్థానము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల ఈమె సైన్సు, సాంకేతిక రంగాలలో ఏకాగ్రత వహించినా బాగుగా రాణిస్తారు. అప్పుడప్పుడు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. 2016 ఏప్రిల్ నుంచి కుజ మహర్దశ 7 సంవత్సరములు , రాహు మహర్దశ 18 సంవత్సరములు, గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని ఇస్తుంది. దేవాలయాలలో పనస చెట్టును నాటిన పురోభివృద్ధి కానవస్తుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.