Publish Date: Mon, 11 Jan 2016 (18:17 IST)
Updated Date: Mon, 11 Jan 2016 (18:19 IST)
నాగసూర్యం.కె-ఉయ్యూరు: మీరు విదియ మంగళవారం, వృశ్చిక లగ్నము, శ్రవణ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని లగ్నము నందు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. భాగ్య స్థానము నందు రవి, బుధులు ఉండటం వ్లల 2016 నందు మీరు మంచిమంచి సంస్థలలో స్థిరపడతారు. భార్య స్థానాధిపతి అయిన శుక్రుడు రాజ్యము నందు ఉండటం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు.
2016 ఆగస్టు నుంచి 2017 ఆగస్టు లోపు మీకు వివాహం అవుతుంది. 2014 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2030 వరకు యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ వెంకటేశ్వరుని తులసీదళాలతో పూజించి అర్చించండి. మీకు అన్నివిధాలా శుభం కలుగుతుంది. శివాలయాలలో జిల్లేడు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.