Publish Date: Sat, 19 Dec 2015 (15:50 IST)
Updated Date: Sat, 19 Dec 2015 (16:25 IST)
రామకృష్ణ-గుడివాడ: మీరు పాడ్యమి బుధవారం, వృశ్చిక లగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. భార్యాస్థానాధిపతి అయిన శుక్రుడు హస్తంగతం అయిపోవడం వల్ల మీకు ఆలస్యము అయింది. 2016 నందు వివాహమయ్యే అవకాశం 50 శాతం మాత్రమే ఉన్నందువల్ల కొంత ప్రయత్నం మీది కూడా అవసరం అని గమనించండి. ప్రతిరోజూ సూర్యభగవానుని పూజించడం వల్ల శుభం కలుగుతుంది. 2017 ఆగస్టు వరకూ సామాన్యంగా ఉంటుంది. తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.