Publish Date: Thu, 15 Oct 2015 (19:06 IST)
Updated Date: Thu, 15 Oct 2015 (19:10 IST)
సుమన్ గారూ... మీరు నవమి, శనివారం, మిథునలగ్నం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు గురు, చంద్రులు ఉన్నందువల్ల తాత్కాలికంగా ఆర్థిక ఒడిదుడుకులు, ఒత్తిడి, చికాకు వంటివి ఎదుర్కొంటున్నారు. 2016 ఫిబ్రవరి తదుపరి మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. మీరు బాగుగా స్థిరపడుతారు.
2019 వరకూ శనిమహర్దశ మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రులలో మంచి పేరు, ఖ్యాతి వస్తుంది. 2019 నుండి బుధ మహర్దశ 17 సంవత్సరములు, కేతు మహర్దశ 7 సంవత్సరములు మొత్తం 24 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్నది. ప్రతిరోజూ ఈశ్వరుని ఆరాధన చేయండి. సర్వదా శుభం కలుగుతుంది.