Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-04-22 మంగళవారం రాశిఫలాలు - లలిత సహస్రనామం పఠిస్తే..

Advertiesment
astro8
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారస్తులకు పోటీ అధికమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం :- స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించన చికాకులు అధికమవుతాయి. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను గౌరవం ఏర్పడుతుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి.
 
మిథునం :- ప్రత్తి, పొగాకు స్టాకిస్టులకు చికాకు తప్పదు. కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. చదువు, వ్యాపారాలపై దృష్టి పెడతారు. రాజకీయాలలో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. స్త్రీలకు ఆర్థిక, కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది.
 
సింహం :- హోటల్, క్యాటరింగు పనివారలకు లాభదాయకం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. సర్దుబాటు ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పారితోషికాలు అందుకుంటారు. స్త్రీలకు ప్రయాణాలలో మెలకువ అవసరం.
 
కన్య :- ఆర్థిక విషయాలలో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. లాయర్లకు, డాక్టర్లకు మందకొడిగా వుంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శుభదాయకం.
 
తుల :- ఉద్యోగస్తులు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో శ్రమించిన కొలదీ లాభాలు గడిస్తారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. ముఖ్యుల రాకపోకలు, ఊహించని ఖర్చులు ఎదుర్కోక తప్పదు.
 
వృశ్చికం :- పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. నూతన పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే ధనానికి ఇబ్బంది కున్నా తెలియని అసంతృప్తి మిమ్ములను వెన్నాడుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించి లాభాలు గడిస్తారు. దైవకార్యాలు, ఆధ్యాత్మిక కారక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచియుండటం ఉత్తమం.
 
మకరం :- వ్యాపారాలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్న పూర్వకంగా కొన్ని కార్యాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలకు రచనలు, సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
 
మీనం :- వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులందు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. విలాసాలకు ధనం బాగా వెచ్చిస్తారు. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. మొక్కుబడులు తీర్చుకుంటారు. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-04-22 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం