Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-04-22 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం

Advertiesment
04-04-22 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఎదుటి వారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తడం వల్ల కోర్టుకు హాజరు కాలేరు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు ఆటంకాలను ఎదుర్కొంటారు.
 
వృషభం :- పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ఉన్నతాధికారులు కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. దుబారా ఖర్చులు నివారించగల్గుతారు.
 
మిథునం :- రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
కర్కాటకం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, కోరిన చోటికి బదిలీలు అనుకూలిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
సింహం :- కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగంలో చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
కన్య :- వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఒప్పందాలు, రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
తుల :- విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికమ వుతాయి. దైవ దర్శనాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. పన్నులు, వాయిదా బకాయిలు సకాలంలో చెల్లిస్తారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి.
 
వృశ్చికం :- వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
ధనస్సు :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు. ప్రముఖులను కలసి బహుమతులను అందజేస్తారు. పాత మొండి బాకీలు వసూలవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రుల రాకతో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం :- రచయితలకు, పత్రికా రంగాల వారికి సామాన్యంగా ఉండగలదు. బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. బంధువుల రాక పోకల వల్ల గృహంలో సందడి కానవస్తుంది. శత్రువులే మిత్రులవుతారు.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. పాత వ్యవహారాలు పరిష్కారదిశగా సాగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడిలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-04-22 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే...