Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-04-22 మంగళవారం రాశిఫలాలు - అమ్మవారిని ఆరాధించి బొబ్బర్లు దానం..

Advertiesment
astro3
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి. గృహోపకరణ వ్యాపారాలు వేగంపుంజుకుంటాయి.
 
మిథునం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళ తప్పవు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. విద్యార్థులు ఉన్నత విద్యలలో రాణిస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
సింహం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- రవాణా రంగంలోని వారు చికాకులను ఎదుర్కొంటారు. ఏ.సి.కూలర్ మోకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆర్థికాభివృద్ధి కానవస్తుంది.
 
తుల :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. బంధువుల కారణాలవల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెలకువ అవసరం.
 
వృశ్చికం :- బంధువుల రాకపోకల వల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. విందు, వినోదాలలో పరిమితి పాటించడం శ్రేయస్కరం.
 
ధనస్సు :- సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం :- విదేశీయాన యత్నాల్లో జాప్యం తప్పదు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. పెంపుడు జంతువుల పట్ల మెళుకువ అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియావారికి మార్పులు అనుకూలిస్తాయి. రాబడికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. 
 
కుంభం :- మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణివల్ల, మతిమరుపు వల్ల అధికారులతో మాటపడక తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
మీనం :- ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్‌: ఉపవాసం- కుటుంబంతో వేడుకల సమయం పంచుకుందాం రండి