Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-02-2022 మంగళవారం రాశిఫలితాలు - గాయిత్రీ మాతను ఆరాధించిన శుభం

Advertiesment
23-02-2022 మంగళవారం రాశిఫలితాలు - గాయిత్రీ మాతను ఆరాధించిన శుభం
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (04:01 IST)
మేషం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం వంటివి అధికమవుతుంది. స్త్రీలకు బంధువర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృత్తి, వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మిథునం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- విద్యార్థులకు అధిక శ్రమ, ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది.
 
సింహం :- కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఆత్మీయుల కలయిక సంతృప్తిని ఇస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు.
 
కన్య :- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగ, వివాహ యత్నాలలో సఫలీకృతులవుతారు. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు, ఆందోళనలు వంటివి అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారస్తులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
 
తుల :- బంధు మిత్రులతో సఖ్యత నెలకొటుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు త్వరలో ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ కాగలవు. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
ధనస్సు :- వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రేమికుల నిర్ణయాలు వివాదాలకు దారితీస్తాయి. ఆస్తి వ్యవహారలల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పెద్దల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. నూతన దంపతులకు ఎడబాటు తప్పదు. అనాలోచిత నిర్ణయాలవల్ల ఇబ్బందులు తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారల్లో నిలదొక్కుకుంటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు ఆశాజనకం. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
కుంభం :- సలహా ఇచ్చే వారే కాని సహకరించే వారుండరు. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు కొనసాగించాలి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
 
మీనం :- మీ వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖులతో మితంగా సంభాషించడం మంది. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనులారా శ్రీవారి దర్శనం: ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా విడుద‌ల