Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-03-2022 శుక్రవారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించడవల్ల పురోభివృద్ధి...

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 18 మార్చి 2022 (04:00 IST)
మేషం :- వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆసక్తి అధికమవుతుంది. ప్రత్తి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది.
 
మిథునం :- స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు సామ్యాంగా ఉంటాయి. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య వివాదాలలు తలెత్తుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
 
సింహం :- ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు.
 
కన్య :- వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. విజయాలు తేలికగా సొంతమవుతాయి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెస్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
తుల :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదు.
 
ధనస్సు :- బంధువుల రాక వల్ల గృహంలో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి అధికం. చిన్నతరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. తప్పనిసరి చెల్లింపుల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు.
 
మకరం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల యిబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
కుంభం :- ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీ రోజున హనుమంతుడి పూజ.. నేతితో దీపమెలిగిస్తే..?