Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-03-2022 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే...

Advertiesment
15-03-2022 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే...
, మంగళవారం, 15 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆడిట్, అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. ఫ్యాన్సీ, కిరణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కాని పూర్తికావు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది.
 
వృషభం :- భాగస్వామికులతో చర్చలు ఫలించవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఏ నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం చాలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. దుబారా ఖర్చులు తెలియకుండానే అవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఫర్వాలేదనిపిస్తాయి.
 
మిథునం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. గృహమార్పుతో సంభవించే ఫలితాలను గమనిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. వేడుకులు, శుభకార్యాలో పాల్గొంటారు. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూల మవుతాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు.
 
కర్కాటకం :- సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలు, ధననష్టం తప్పకపోవచ్చు,
 
సింహం :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాల మొత్తంలో అధిక భాగం తీర్చగలుగుతారు. ఖర్చులు పెరిగినా భార మనిపించవు. ప్రేమికుల వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. శుభకార్యాల్లో ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
కన్య :- ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పనివారలకు కలిసిరాగలదు.
 
తుల :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులు యత్నం ఫలిస్తుంది. ఎదుటివారి వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంటారు. మీ యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. పత్రికా రంగంలో వారికి ఒత్తిడి, చికాకులు అధికం.
 
వృశ్చికం :- నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు అవార్డు వంటి శుభఫలితాలుంటాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటు చేసుకుంటాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
మకరం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. వాహనం, విలువైన గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి.
 
కుంభం :- సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు.
 
మీనం :- కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఖర్చులు కొంతవరకు నియంత్రణ చేయగలుగుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళ ప్రదోష వ్రతం.. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు..?