Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-03-2022 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం...

Advertiesment
11-03-2022 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం...
, శుక్రవారం, 11 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఫ్యాన్సీ, కిరణా, మందులు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం :- మనస్సుకు నచ్చినవారితో కాలం గడుపుతారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మెడికల్, ఎరువులు, ఫ్యాన్సీ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం.
 
మిథునం :- ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, బదిలీల యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు తాపి పని వారికి పని వారితో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కారమవుతాయి. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం :- మిత్రుల కలయిక అనుకూలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటినుండో ఆగి వున్న పనులు పునః ప్రారంభమవుతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
 
సింహం :- పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావచ్చు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి.
 
కన్య :- మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులవల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులను ధన సహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
తుల :- ప్రత్తి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవలన మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు చికాకులు తప్పవు. స్త్రీల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. 
 
ధనస్సు :- వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. ధనం బాగా అందుట వలన ఏ కొంతైనా నిల్వచేయ గలుగుతారు.
 
మకరం :- ఉపాద్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ వహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
కుంభం :- ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల చికాకులు తప్పవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికంకాగలదు. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు.
 
మీనం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలం. చిన్న తప్పిదమైనా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులకు అలెర్టు.. ఆ రోజుల్లో శ్రీవారి అర్జిత సేవలు రద్దు