Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-04-2023 తేదీ శుక్రవారం దినఫలాలు - శ్రీ మహాలక్ష్మీని ఆరాధించడం...

Advertiesment
Cancer
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్, ఇంజనీరింగ్ రంగాల వారికి పనిభారం తప్పవు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఆర్థిక రహస్యాలు గోప్యంగా ఉంచండి.
 
వృషభం :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. టెండర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. విదార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు.
 
మిథునం :- భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో రాణింపు, లాభాలు గడిస్తారు.
 
కర్కాటకం :- అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో మానసిక సంతృప్తి పొందుతారు. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. స్థిరచరాస్తులకు సంబంధించిన సంప్రదింపులు, వాణిజ్య ఒప్పందాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. దూరప్రాంతం నుండి వచ్చిన ఒక లేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాల నిస్తాయి.
 
కన్య :- ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇతరుల ముందు మీ ఉన్నతినిచాటుకునే యత్నాలు విరమించండి. వ్యాపార వ్యవహారాలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
 
తుల :- హోల్ సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చిన్న తరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపిస్తుంది. వాహనచోదకులకు చికాకులు తలెత్తుతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. మీ సమస్యలకు ఒక చక్కనిపరిష్కార మార్గం లభిస్తుంది. దూరప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణాలు, వాయిదాలు సకాంలో చెల్లిస్తారు.
 
ధనస్సు :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. ప్రేమికులకు తొందరపాటు తగదు.
 
కుంభం :- మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివి తేటలతో ముందుకుసాగి జయం పొందండి. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
మీనం :- ఆర్థికంగా పురోభివృద్ధి పొందుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు కొలిక్కి వస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-04-2023 తేదీ గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి...