Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

Advertiesment
astro1

రామన్

, సోమవారం, 24 నవంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలం. కార్యసిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితం ఉంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు. పెద్దల సలహా పాటించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త పనులు చేపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. లక్ష్యం సాధిస్తారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఏ పనీ చేయబద్ధి కాదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పనులు పురమాయించవద్దు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఏ విషయాన్నీ పట్టించుకోవద్దు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి గురవుతారు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పబలంతో యత్నం సాగించండి. ఓర్పుతో శ్రమిస్తేనే కార్యం సాధ్యమవుతుంది. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఖర్చులు సామాన్యం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండానికి యత్నించండి. అప్రియమైన వార్త వింటారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహబలం అనుకూలంగా ఉంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధృఢసంకల్పంతో ముందుకు సాగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. లౌక్యంగా బాకీలు రాబట్టుకోవాలి. నగదు జమ చేసేటపుడు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...