Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-07-2023 సోమవారం రాశిఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

Advertiesment
astro1
, సోమవారం, 24 జులై 2023 (04:00 IST)
మేషం :- కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారులను తక్కువ అంచనావేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులకు లోనవక తప్పదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం.
 
వృషభం :- రిప్రజెంటేటివ్‌లకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.
 
మిథునం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దలను ప్రముఖులను కలుసు కోగలుగుతారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఏ యత్నం కలిసిరాక పోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. వ్యవసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
సింహం :- మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలుకొనుట మంచిది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎందుర్కొంటారు. ఎవరికీ బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
కన్య :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్యీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి.
 
తుల :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృశ్చికం :- స్థిరాస్తి, క్రయవిక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. సోదరీ సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు.
 
మకరం :- రాజకీయాల్లో వారికి ఆందోళన అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగినవ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫరీచర్ సమకూర్చుకుంటారు.
 
కుంభం :- సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
మీనం :- అతిగా సంభాషించడం అనర్థదాయకం అని గమనించగలరు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం అగుటవలన ఆందోళనకు గురవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-07-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని ఆరాధించిన సర్వదా శుభం...