Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-07-2022 ఆదివారం రాశిఫలాలు... తొందరపాటు తనం వద్దు

Advertiesment
24-07-2022 ఆదివారం రాశిఫలాలు... తొందరపాటు తనం వద్దు
, ఆదివారం, 24 జులై 2022 (05:00 IST)
మేషం:- ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం పొందుతారు. కళాకారులకు పురోభివృద్ధి కానవస్తుంది. అధ్యాత్మిక, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం:- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులెదుర్కుంటారు. క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.
 
మిథునం:- వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండగలదు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. మీ లక్ష్యంపట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి పథకాలు వేస్తారు. ఖర్చులు అధికమవుతాయి.
 
కర్కాటకం:- నిర్మాణాత్మక పనుల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఊహించని రీతిలో ధనలబ్ది పొందుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
సింహం: - విలువైన బహుమతులు అందుకుంటారు. ఆధ్యాత్మిక భావం పెరగుతుంది. పాత వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించండి.
 
కన్య: వస్త్ర, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. దైవదీక్షలు, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి లభిస్తుంది. మాట తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
తుల:- భాగస్వామిక వ్యపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కొవలసి వస్తుంది. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. గృహోపకరణాలు అమర్చుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం:- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహనిలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఒత్తిడి. ప్రముఖులను కలుసుకుంటారు. మీకు కాలం అనుకూలంగా ఉన్నట్లు తోస్తుంది.
 
ధనస్సు: - ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి. విద్యారులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. సభా సమావేశాలలో పాల్గొంటారు.
 
మకరం:- భాగస్వామిక చర్చలు ఒకంతట పూర్తికావు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచన లుంటాయి. మీ సంతానం వివాహ, ఉద్యోగ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
కుంభం:- ముఖ్యులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల సహాయ, సహకారాలు లభిస్తాయి. స్త్రీలు మానసిక, శారీరిక ఒత్తిడులకు లోనౌతారు.
 
మీనం:- గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. రుణాలు, పెట్టుబడులు అందుతాయి. వైద్యులకు సంతృప్తి చేకూరుతుంది. దూరప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకస్మిక ధనప్రాప్తికి పరిహారాలు.. రావలసిన సొమ్ము చేతికి రావాలంటే?