Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-05-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీ నారాయణ స్వామిని ఎర్రని పూలతో..?

Sathya Narayana
, మంగళవారం, 23 మే 2023 (04:00 IST)
లక్ష్మీనారాయణస్వామిని ఎర్రని పూలతో పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలించదు.
 
వృషభం:- దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు శుభదాయకం. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది.
 
మిథునం:- ఏ.సి., ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్ధిక ఇబ్బందులు అంతగా ఉండవు. కుటుంబీకుల మధ్య ముఖ్యమైన వ్యవహారాలలో ఏకీభావం కుదరదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి.
 
కర్కాటకం:- ప్లీడర్లకు ఆశాజనకం. స్త్రీలకు అధిక శ్రమ, నిరుత్సాహం తప్పదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా, సాంఘీక కార్య క్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికం అవుతాయి. 
 
సింహం:- ఆర్థిక లావాదేవీలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు అన్నింటా తమ ప్రతిభను నిరూపించుకుంటారు. రాజకీయాల్లో వారు తమ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ రంగాల్లో వారికి వారి హోదా పెరిగే సూచనలున్నాయి. దైవదర్శనాలు చేస్తారు.
 
కన్య:- అనుకోని ఖర్చులు, సమయానికి ధనం అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి సామాన్యం. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు ఆస్కారం ఉంది. వైద్యులకు సంతృప్తి, ఆడిటర్లకు ఒత్తిడి. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
తుల:- బంధుమిత్రుల నుంచి అపనిందలను ఎదుర్కొంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
వృశ్చికం:- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలను అధికమిస్తారు. 
 
ధనస్సు:- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత అవసరం. నిర్మాణ పనులలో సంతృప్తి కానవస్తుంది. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
 
మకరం:- కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. భాగస్వామిక చర్చలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో ఒకింత నిరుత్సాహం తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరం.
 
కుంభం:- ఉద్యోగస్తులు తోటవారి ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీలకు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మీనం:- నూతన ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు, విదేశీయానం అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐరన్, కలప,సిమెంటు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్ధినులకు తోటివారి కారణంగా ఇబ్బందులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-05-2023 సోమవారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం...