Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-07-2023 శుక్రవారం రాశిఫలాలు

Advertiesment
Pisces
, శుక్రవారం, 21 జులై 2023 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలోపెట్టి జయం పొందండి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి.
 
మిథునం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమతాయి. భవిష్యత్తులో ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు అధికంగా ఉంటాయి. మీ సేవాదక్షత, కార్యదీక్షలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం, బాధ్యల మార్పు సంభవం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
సింహం :- ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీ సంకల్పానికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమించండి.
 
కన్య :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయాజనాలు సాధించడం కష్టసాధ్యం. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలిసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.
 
తుల :- బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు శుభదాయకం. ఓర్పు, సహనంతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్విహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం :- శ్రీవారు, శ్రీమతిగౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు.
 
ధనస్సు :- విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి పై అధికారుల మన్ననలను పొందుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.
 
మకరం :- స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది.
 
కుంభం :- సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు.
 
మీనం :- ఫ్లీడరు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణ శుక్రవారం: గుమ్మానికి పసుపు-కుంకుమ.. ఇరువైపులా దీపాలు పెడితే..? (video)