Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-08-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని మంకెన పూలతో పూజించిన శుభం..

Capricorn
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి.
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, మిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మిథునం :- నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. అదనపు రాబడికోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండావచ్చిన అవకాశాన్ని సద్వినియోం చేసుకోవటం మంచిది. 
 
కర్కాటకం :- ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. ముఖ్యులతో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించండి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. కుటుంబీకులతో కలిసి వేడుకలలో ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్తోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారుపనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు ఎదుర్కొంటారు. 
 
తుల :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగా గడుపుతారు. సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది.
 
వృశ్చికం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సమయానికి సహకరించని వ్యక్తుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.
 
ధనస్సు :- విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
 
మకరం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. చేపట్టినపనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరిచటంవల్ల చిక్కుల్లో పడేఆస్కారం ఉంది. సొంతనిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. రాజకీయనాయకులు సాంఘిక కార్యక్రమాలలోనూ, వేడుకలలోనూ పాల్గొంటారు.
 
కుంభం :- కుటుంబీకులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రవాణా రంగాలలో వారికి ప్రయాణీకులతో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. అందరికి సహాయం చేసి మాటపడతారు.
 
మీనం :- కోళ్ళ, గొట్టె, మత్స్య వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటాయి. రావలసిన బకాయిలు వాయిదాపడుట వలన ఆందోళనకు గురవుతారు. ప్రముఖులతో కలసి ఉల్లాసంగా కడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-08-2023 నుంచి 26-08-2023 వరకు మీ వార రాశిఫలాలు