Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

Advertiesment
Horoscope nakshatra

రామన్

, బుధవారం, 7 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆప్తులను కలుసుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు పురమాయించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అందరితోనూ మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింసులు జరుపుతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వం స్వీకరిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు మొదలెడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వింటారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్థతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. విందులు, వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృకథంతో యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పనులు వేగవంతమవుతాయి. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...