Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-01-2024 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన శుభం...

Advertiesment
Astrology
, గురువారం, 4 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| అష్టమి సా. 6.23 హస్త ప.2.48 రా.వ.11.27 ల 1.11.
ఉ. దు. 10. 15 ల 10.59 ప.దు.2.39 ల 3.23.
సాయిబాబాను ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. ఎప్పటి నుంచో వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రయాణాలలో చికాకు, నిరుత్సాహంవంటివి తప్పవు.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు మీరు చూసుకోవటం ఉత్తమం. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. కీలకమైన పత్రాల విషయంలో సమాచారం అందుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ అంచనాలు నిజమై ఊపిరి పీల్చుకుంటారు. ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు పైఅధికారులతో అవగాహన కుదరదు. ఋణ యత్నాలు వాయిదా పడతాయి. ఊహించని వారి నుండి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం :- విద్యాసంస్థలలో వారికి చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకొలేక పోతారు. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు.
 
సింహం :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశలు దక్కుతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చి మీరు సమస్యలను తెచ్చుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారమునందు రావలసిన బాకీలు వచ్చును. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి.
 
కన్య :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. భాగస్వామిక ఒప్పందాలు ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలు ఇస్తాయి. చిన్న తరహా పరిశ్రమవారికి లాభదాయకంగా ఉంటుంది.
 
తుల :- ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి అగ్రిమెంటులు వాయిదా వేస్తారు. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి.
 
వృశ్చికం :- చేపట్టిన పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఓర్పు, సంయమనం అవసరం. స్త్రీలకు అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి.
 
ధనస్సు :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీల అభిప్రాయాలకువ్యతిరేకత ఎదురవుతుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఇబ్బందులు ఉండవు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి కలిసివచ్చే కాలం.
 
మకరం :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీద ఏకాగ్రత వహించలేరు. విద్యార్థులకు ఉన్నత విద్యల విషయంలో ఒత్తిడి, ఆందోళన తప్పవు.
 
కుంభం :- స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడటం మంచిది. భాగస్వామిక వ్యాపారాలు విడనాడి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మధ్యవర్తిత్వం, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు: ఆడ, మగ శునకాలను ఎవరు పెంచవచ్చు..?