Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-12-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు

Advertiesment
27-12-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (06:00 IST)
కనకదుర్గాదేవిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం : బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు, దైవసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెలకువ అవసరం. 
 
వృషభం : కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వ్యవహారాలు మీ మాట ప్రకారమే సాగుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మిథునం : ఉద్యోగస్తులు సేవా, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ విషయంలోనూ ఎదుటివారిని అతిగా విశ్వసించడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులే ఉంటాయి. ఆలయ సందర్శనాలలో చిన్నచిన్న చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : చిట్స్, ఫైనాన్స్ రంగాలవారికి ఆటుపోట్లు తప్పవు. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా  సాగుతాయి. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. 
 
సింహం : ఉద్యోగస్తులు మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : రవాణా, ఆటోమొబైల్ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మత్స్యు, కోళ్ళు, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
తుల : బంధువులరాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. 
 
వృశ్చికం : విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో సత్ఫలితాలు పొందుతారు. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసివస్తుంది. 
 
ధనస్సు : ఫ్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు ఆరోగ్యం భంగం, నీరసం వంటి చికాకులు అధికంగా ఎదుర్కొంటారు. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో పోటీ ఆందోళన నెలకొంటుంది. 
 
మకరం : దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు తల, నరాలకు సంబంధఇంచిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులను ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
కుంభం : ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టకుండా మెలకువతో వ్యవహరించండి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మీనం : అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విద్యార్థులు భయం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం పూట ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే?