Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-11-2020 - గురువారం మీ రాశి ఫలితాలు - సాయిబాబా గుడిలో అన్నదానం..?

Advertiesment
Daily Horoscope
, గురువారం, 12 నవంబరు 2020 (10:04 IST)
సాయిబాబా గుడిలో అన్నదాం చేసినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్వయం కృషితోనే మీరు బాగా రాణిస్తారు. 
 
వృషభం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. 
 
మిథునం: దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు, పెట్టిపోతలు అతిథులను ఆకట్టుకుంటాయి. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. రాజీ మార్గంతో ఆస్తి, స్థల వివాదాలు పరిష్కారం కాగలవు.

కర్కాటకం: ఇచ్చిపుచ్చుకునే విషయాలు, పెట్టిపోతలతో పెద్దల సలహా పాటించండి. పెరిగిన ధరలు చాలీచాలనీ ఆదాయంతో సతమతమవుతారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెలకువ వహించండి. 
 
సింహం: రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. స్పెక్యులేషన్ సామాన్యంగా వుంటుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. విదేశీయానం, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. శత్రువులు మిత్రులుగా మారుతారు. 
 
కన్య: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వ్యవసాయ రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడకతప్పదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
తుల: ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. మీ ఆంతరంగిక కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సాయం అందుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు. 
 
వృశ్చికం: విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
ధనస్సు: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఖర్చులు అదుపు చేయలేకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 
 
మకరం: ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కుంభం: ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుంది. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి.
 
మీనం: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం: వైభవోపేతంగా ధ్వజారోహణం