Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-11-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవునికి పూజలు చేస్తే...

Advertiesment
11-11-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవునికి పూజలు చేస్తే...
, బుధవారం, 11 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ఉపవాసాలు, శ్రమాధిక్యత వల్ల స్త్రీలు అస్వస్థతకు లోనవుతారు. బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోకపోవడం క్షేమదాయకం. ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
వృషభం : గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల సమర్థతు, సమయపాలన అధికారులను ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. 
 
మిథునం : స్త్రీలకు, టీవీ చానెళ్ళ నుంచి ఆహ్వానం అందుతుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సలహా ఇచ్చే వారే కాని సాయపడేవారుండరు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం పొందుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : మీ ఇబ్బందులను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో వ్యాపారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పు. ఆప్తులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిశోధకులకు, గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. 
 
సింహం : స్త్రీలకు ఇరుగు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులను మెప్పించడం కష్టం. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించవు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్తగా మెలగాలి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. 
 
తుల : ఇంటాబయట సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిదికాదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు.
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలో వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాదోపవాదాలకు భేషజాలకు దూరంగా ఉండండి. 
 
ధనస్సు : రుణం పూర్తిగా చెల్లించి తాకట్టులు విడిపించుకుంటారు. స్త్రీలకు శుభకార్యాలు, వేడుకల్లో బంధుమిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. క్యాటరింగ్ పనివారలకు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా బంధువుల సహకారం వల్ల సమసిపోగలవు. వ్యవహారాలు ఒప్పందాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వెల్లడించాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. 
 
కుంభం : ఒక అవకాశం కలిసిరావడంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
మీనం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. దానధర్మాలు చేసి మంచి పేరు ఖ్యాతి గడిస్తారు. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 13 శుక్రవారం ధన త్రయోదశి, ఏం చేయాలి?