Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మకరాసనంతో పూర్తి ప్రశాంతత

మకరాసనంతో పూర్తి ప్రశాంతత
మకరాసనంతో పూర్తి ప్రశాంతత లభిస్తుంది. ఉరుకులు పరుగులపై ఉండేవారికి ఈ ఆసనానం వేస్తే ఇట్టే ప్రశాంతత లభిస్తుంది. మకర అంటే మొసలి అని దాదాపు అందరికి తెలిసినదే. అంటే ఈ ఆసనం మొసలి ఆకారంతో పోలి వుంటుందన్నమాట.

మకరాసనం వేసే పద్దతి
నేలపై చక్కగా వెల్లకిలా పడుకోవాలి.
కాళ్ళను ఒక చోటకు చేర్చండి.
భజాలు నేలపై విశాలంగా పరచాలి.
పాదాల చివరభాగం ఖచ్చితంగా నేలను తాకుతున్నట్టుగా ఉండాలి.
మెల్లగా ఎడమకాలిని మడవాలి. మోకాలు ఆకాశాన్ని చూపుతున్న విధంగా ఉండాలి.
అదే సమయంలో కుడి చేయిని ఉన్న దిశకు వ్యతిరేకంగా తిప్పుకోవాలి.
అలాగే బోర్లపడుకోవాలి.
రెండు కాళ్ళను ఎడము చేయాలి.
కుడిచేయి ఎడమ భుజం కింద ఉండేలా చూడాలి. ఎడమ భుజాన్ని కుడిచేత్తో పట్టుకోవాలి.
అలాగే కుడిభుజం కింద ఎడమ చేయి ఉండేలా చూడాలి. కుడి భుజాన్ని ఎడమచేత్తో పట్టుకోవాలి.
ఇప్పుడు మడిగి ఉన్న మోచేతుల వలన ద్వి త్రిభుజాకారము ఏర్పడుతుంది.
ముంజేతులు ఒకదానికొటి క్రాస్ అవుతుంటాయి.
నుదిటిని ద్వి త్రిభుజాకారము ఆనించాలి.
కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి.
పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ సాధన చేయాలి.

WD
మకరాసనంతో లాభాలు
కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు తగ్గుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu