Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం

పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
సంస్కృతంలో 'ధనస్సు' అంటే బాణం. ఆసనం అంటే యోగ ప్రక్రియ. ఉదరం, తొడలు నేలను తాకుతూ కాళ్ళు, భుజాలను ధనస్సు ఆకారంలో విన్యాసం చేయడాన్ని పూర్ణ ధనురాసనం అంటారు. దీనివలన శరీరంలోని అంతర్భాగ అవయవాలకు మంచి వ్యాయమం దొరుకుతుంది.

యోగాసనం వేయు పద్దతి
చదునునైన నేలపై బోర్ల పడుకోవాలి.
తల, మెడ, గడ్డం, ఛాతీ తొడలు, మోకాళ్ళను ఏకకాలంలో వెనుకకు లేపాలి.
గడ్డాన్ని నేలపై నుంచి మెల్లగా లేపాలి.
అదే సమయంలో శరీర కింది భాగాన్ని, తల, మెడను ఊర్ధ్వముఖంలో లేపాలి.
మోకాళ్ళు, పాదాలు దగ్గరగా ఉండేలా చూడాలి.
చూపుపైకి ఉండాలి.
తల వీలైనంతగా వెనక్కు లేపాలి.
చీలమండను బలంగా లాగాలి.
చూపు చక్కగా ఉండాలి.
శరీరమంతా కూడా నాభిపై సమతుల్యంగా ఉండేలా చూడాలి.
సాధ్యమైనంత వరకు శరీరాన్ని విల్లు రూపంలోకి తీసుకురావాలి.
ఈ దశలో గాలి పీల్చుకోవడం ఆరంభించాలి.
తొడలు, ఛాతీ, కటిలు నేలను తాకరాదు.
సాధ్యమైనంతగా పైకి చూడాలి.
విన్యాసంలో ఇది చివరి దశ అవుతుంది. కాళ్ళు, భుజాలు నొప్పిగా అనిపిస్తాయి.
భుజాలు సాగదీసినట్లుగా ఉంచాలి.
కాళ్ళు కిందకు జారకుండా జాగ్రత్త పడాలి.
వీలైనంత వరకు ఈ దశను మరింతగా పొడిగించాలి.
ఈ దశలో కనీసం 5 సెకనులు ఉండాలి. ఎక్కువగా కష్టమనిపిస్తే గాలి వదులుతూ ఆసనం నుంచి బయటకు రావాలి.

WD
ఉపయోగాలు
ఈ ఆసనం శరీరానికంతటికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి.

జాగ్రత్తలు
హరేనియా, పెద్దప్రేవు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయడం అంత మంచిది కాదు. ఉదర సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకూ ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu