Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం

Advertiesment
దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
WD
నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. అందుకే దీనిని నౌకాసనం అంటారు. దీనినే విపరీత నౌకాసనం అని కూడా అంటారు.

ఆసనం వేయు పద్దతి
ఉదరం, ఛాతీ భాగం నేలను తాకే విధంగా భూమిపై పడుకోవాలి.
నుదటి భాగం నేలను తాకేటట్టు ఉండాలి.
భుజాలు, పాదాలు వాటి వాటి స్థానాల్లో ఉండేలా చూచుకోవాలి.
భుజాలను ముందుకు చాచాలి.
భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
అరచేతులు కిందకు పెట్టాలి.
చేతి వేళ్ళ మధ్య యడము ఉండరాదు. ఒకదానికొకటి దగ్గరగా చేర్చాలి.
నేలపై ఆనించిన నుదటి భాగాన్ని రెండు భుజాలకు మధ్యన ఉండేలా చూసుకోవాలి.
గాలి పీల్చుకుంటూ కాళ్ళు, మెడ, భుజాలు, తల భాగాలను మెల్లగా లేపాలి.
మోచేతులు, మోకాళ్ళు ఎటువంటి పరిస్థితులలో వంచరాదు.
ఆసన సమయంలో జర్కులు ఉండరాదు.
పై భుజాలు ఖచ్చితంగా చెవులను తాకుతూ ఉండాలి.
పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.
తలను వీలైనంతగా పైకి లేపాలి.
లేపిన పైభుజాల మధ్య తల ఉండేలా చూసుకోవాలి.
వీలైనంత బాగా వెనక్కు వంగాలి.
శరీరం వంచిన విల్లు తరహాలో ఉండాలి.
వంపు అనేది కాలి బ్రొటన వేలు నుంచి చేతి వేళ్ళ వరకు ఉండాలి.
కాలి బ్రొటన వేలు, చేతి వేళ్ళు పరస్పరం సమాంతరంగా అదేస్థాయి ఉండేలా చూసుకోవాలి.
కింది ఉదరభాగంపై శరీరబరువు సమతుల్యం అయ్యేలా చూసుకోవాలి.
పొత్తి కడుపు కింది భాగం మాత్రమే నేలను తాకి ఉండేలా చూసుకోవాలి.
మిగిలిన భాగాలు కదలిక ఉండరాదు.
కనీసం 10 సెకనులపాటు శ్వాస బిగపట్టి ఉంచాలి.
మెల్లగా గాలి వదులుతూ ప్రారంభదశకు చేరుకోవాలి.
శవాసన దశకు చేరుకుని విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు
ఈ ఆసనం వలన ఉదరం, భుజాలు, మెడ, దృఢంగా తయారవుతాయి.
విపరీత నౌకాసనంతో వెన్నుపూస సంబంధిత లోపాలను సవరించుకోవచ్చు.
ఛాతీ, ఊపిరితిత్తులను విశాలం చేస్తుంది. అలాగే దృఢంగా చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu