హలాసనంతో ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో...

హలాసనం వేయాలనుకునేవారు విపరీత కర్ణిక మరియు సర్వాంగాసనాలను వేయటంలో బాగా ఆరితేరినవారై ఉండాలి. దాదాపు పశ్చిమోత్తాసనానికి దగ్గరగా ఉంటుంది ఈ హలాసనం. మరోరకంగా చెప్పాలంటే... కొన్ని ఫోజుల్లో ఇది భుజంగాసనం, చక్రాసనం, మత్స్యాసనాలకు దగ్గరగా ఉంటుంది.

సంస్కృతంలో హల మరియు ఆసన అనే రెండు పదాలకు వేరు వేరు అర్థాలున్నాయి. హల అనేది నాగలినీ, ఆసనం అనేది చేసే భంగిమను సూచిస్తాయి. అంటే... ఈ హలాసనాన్ని వేసేవారు నాగలి ఆకారం ఎలా వంగి ఉంటుందో ఆసనం వేసిన సమయంలో అలా ఉంటారన్నమాట.

ఆసనం వేసే పద్ధతి
హలాసనం వేసేవారు ఓసారి అర్ధ హలాసన భంగిమను మననం చేసుకోండి
అయితే చేతులపై ఎటువంటి ఒత్తిడిని పెట్టకండి
అదేవిధంగా మీ అరచేతులను భూమికి గట్టిగా ఒత్తిపట్టేపుడు క్రమంగా గాలి వదలండి
మెల్లగా గాలి పీలుస్తూ వెన్నును సాధ్యమైనంత ఎక్కువగా వంచి మీ కాళ్లను తలమీదుగా భూమిని తాకేటట్లు చూడండి
ఈ స్థితిలో మీ వక్షస్థలం గడ్డానికి తగలాలి.
ఇప్పుడు మెల్లగా మీ చేతులను వెనక్కి చాచి పాదాల దగ్గరకు తీసుకువెళ్లండి.
ఈ భంగిమలో మీ కాళ్లను నిటారుగా కొద్దిసేపు అలానే ఉంచాలి.
ఆ తర్వాత శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి. ఈ భంగిమలో కనీసం రెండు నిమిషాలవరకూ ఉండేటట్లు చేయండి.

WD
తిరిగి పూర్వస్థానానికి...
మళ్లీ తిరిగి మామూలు స్థానానికి రావటానికి, మీ చేతులను మీ శరీరానికి ఇరువైపులా ఉంచండి.
క్రమంగా గాలిని వదలండి
అదేవిధంగా మోకాళ్ల వద్ద మడవకుండా మీ కాళ్లను మెల్లగా సాధారణ స్థితికి కిందికి దించండి.
ఇలా మరో రెండుసార్లు హలాసనాన్ని చేయండి.

గమనిక
గర్భిణీతో ఉన్నవారు హలాసనాన్ని వేయరాదు
ఒకవేళ ఉదర భాగంలో నొప్పివంటిదేదైనా తలెత్తితో హలాసనం వేయటాన్ని ఆపివేయాలి.
లివర్ వంటి అవయావకు సంబంధించి బాధ కలిగినట్లు మీకు అనిపిస్తే, హలాసనం వేయకూడదు.
అధిక రక్తపోటు గలవారు, గుండెజబ్బులు, వరిబీజం, అల్సర్, స్పాండిలోసిన్ వున్నవారు హలాసనం వేయకూడదు.

WD
హలాసనంతో ఉపయోగాలు
సెక్స్ గ్రంధులను ఉత్తేజపరచటంలో హలాసనం ఎంతగానో సహాపడుతుంది.
ఉదరభాగంలో ఉన్న గ్రంధులు మరింత మెరుగై సవ్యంగా పనిచేస్తాయి.
రోజూ హలాసనాన్ని వేయటం వలన బద్దకం, సోమరితనానికి దూరమవవచ్చు.
శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్లు సహాయపడుతుంది,
అంతేకాదు క్రమం తప్పకుండా హలాసనాన్ని వేయటం వలను కాస్తంత ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది.
నడుము నాజూకుగా తయారవుతుంది.
ఉదర భాగం తగ్గి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు.
పిరుదలు, నడుము, తొడలు, ఉదరభాగంలో ఉన్న అధిక కొవ్వు ఖర్చయిపోతుంది.
గొంతు భాగం శుభ్రపడుతుంది. కనుక ఉపాధ్యాయులు, నేపధ్య గాయకులు హలాసనం వేయటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
మెడచుట్టూ ఉండే కండరాలు బలిష్టంగా తయారవుతాయి.
ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
ముఖానికి, మెదడుకు రక్తప్రసరణ మరింత మెరుగుగా ఉంటుంది.
వెన్నెముకకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తొలగుతాయి.
జీర్ణక్రియ మెరగుగా పనిచేస్తుంది.
గుండె సంబంధిత కండరాలపై ఒత్తిడి పెరగటంవల్ల గుండె మరింత బలంగా మారుతుంది.
రక్తప్రసరణ మెరగవుతుంది