Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనంతో మధుమేహం నియంత్రణ
శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి.

వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి.

శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి.

కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంలోనే ఖచ్చితంగా ఉంచాలి. కాళ్ళ ఎత్తే సమయంలోకాని, తిరిగి యథాస్థితికి చేర్చే సమయంలోకాని, మోకాళ్ళ వంచరాదు.

WD
ఉపయోగాలు
ఈ ఆసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కాళ్ళు, చీలమండ వాపులకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తి, మలబద్ధకాలు నయమవుతాయి.

ఈ ఆసనం జీర్ణక్రియను పెంచుతుంది. నరాల వాపు, మొలలు నివారించబడుతాయి. కాలేయం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది. ఉదరకోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu