Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృక్షాసనం చేయండిలా...!

Advertiesment
యోగా ఆసనాలు వృక్షాసనం ఎడమకాలు మోకాలు మడిమ మడిమ కుడి తొడ చేతులు నడుము గాలి
i) వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి ఎడమ కాలును మోకాలు వద్ద వంచి ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి.

ii) గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి.

iii) గాలి పీలుస్తూ రెండు చేతులూ తలపైకి తీసుకెళ్ళి అరచేతులను కలిపి శరీరం మొత్తాన్ని పైకి లాగాలి.

గాలి వదులుతూ ii స్థితిలోకి రావాలి. అలాగే మళ్ళీ గాలి వదులుతూ i స్థితిలోకి రావాలి. తర్వాత సమస్థితిలోకి రావాలి.

లాభాలు : కాలి కండరాలకు అధిక వ్యాయామం కల్గుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులున జ్ఞానం కల్గుతుందంటున్నారు యోగా నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu