Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం

తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో వేసే భంగిమనే సమస్థితి ఆసనమని కూడా అంటారు. సమ అంటే కదలని, సమతత్వం, స్థితి అంటే నిలబడుట అని అర్థం. కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే సమస్థితి ఆసనం లేదా తాడాసనం అవుతుంది.

WD
ఆసనం వేయు పద్దతి :
చదునైననేలపై పాదాలలోని మడమల నుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు రెండు లోపలివైపుకు అభిముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర విన్యాసస స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి.

ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెళ్ళగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు :
ఈ ఆసనం వేయడం వలన దైనందిన చర్యల్లో భాగంగా మరిచిపోయిన సమస్యలను గుర్తించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu