Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం

Advertiesment
మత్స్యాసనం చేప భంగిమ ఆసనం ప్రావీణ్యం
మత్స్యాసనం చేప భంగిమలో ఉంటుంది. సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం. సాధారణంగా నీటిలో ఈ ఆసనం వేయడంలో ప్రావీణ్యం సాధించినవారు చేతులు, కాళ్లు సాయం లేకుండా ఈ ఆసనస్థితిలో పైకి తేలుతారు.

చేయుపద్ధతి :
ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి.
మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలి
మోచేతులను వెనుకకు తీసుకురావాలి.
మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి.
ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు.
మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి.
ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి.
మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి.
మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి.
మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి.
నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి.
మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి.
వెన్నుపూసను విల్లులాగా వంచాలి.
అదే సమయంలో మీ మెడ మరియు తలను గరిష్ఠ స్థాయిలో వెనుకకు వంచాలి.
మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి.
మీ చేతులను ముందుకు చాచండి.
మీ తొడల వెనుక భాగాలను పట్టి ఉంచండి.
మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేందుకు మీ మోచేతులు ఒక కప్పీలాగా ఉపయోగపడాలి.
ఇది మీ వెన్నుపూసను వంచేందుకు మరియు మీ తలపైభాగం నేలమీద సరైన స్థితిలో ఉంచేలా తోడ్పడుతుంది.
బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మూడూ ఎదురుగా ఉన్న కాలివేళ్ళను గట్టిగా పట్టి ఉంచడానికి గాను కొక్కీ రూపంలో ఉండాలి.
కనీసం 10 సెకనుల పాటు ఈ స్థితిలోనే ఉండాలి.
మీరు మామూలుగానూ, క్రమబద్ధంగాను శ్వాసను పీలుస్తుండాలి.
ఈ స్థితినుంచి మెల్లగా ప్రారంభంలోని పద్మాసన స్థితికి మళ్లాలి.

WD
ప్రయోజనాలు :
ఛాతీ పరిమాణం పెరుగుతుంది.
మీ ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి.
వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది.
మీ వెన్ను మరియు మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి.
సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటునుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.

హెచ్చరికలు :

ఛాతీలో లేదా మెడలో నొప్పితో బాధపడుతున్నప్పుడు మీరు ఈ ఆసనం వేయరాదు.

Share this Story:

Follow Webdunia telugu