ప్రస్తుతం ప్రపంచమంతా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచాన్నే తమ గుప్పిట్లో ఉంచుకున్న నేటి ప్రజలు ప్రస్తుతం యోగా అంత అవసరమా అని అంటుంటారు కొందరు.
భౌతిక సుఖ జీవనానికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖ జీవనానికి యోగా ఉందంటున్నారు యోగా గురువులు. దాన్ని సరైన పద్ధతిలో సంపూర్ణంగా శరీరానికి అందించగలిగితే అది ఎంతో మేలు చేస్తుందంటున్నారు వారు.
మనిషి తన జీవితం ఎలావుండాలి, తనకు ఎలాంటి అనుభూతులు కలగాలి అనేది ప్రతి మనిషి నిర్ణయించుకోగలగాలి. అలాంటి శక్తిని యోగా అందిస్తుందంటున్నారు యోగా గురువులు. కాబట్టి ప్రతి ఒక్కరుకూడా యోగా చేస్తారని ఆశిద్దాం.
యోగా అనేది భారతదేశంలో పుట్టి పెరిగింది. దీనిని ప్రస్తుతం విదేశీయులు ఎక్కువగా పాటిస్తూ, తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. దీనివలన వారిలో మానసికోల్లాసం పెరిగి ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారని కొందరు విదేశస్తులు తెలిపారు.