యోగక్రియలు శరీరం లోపల మరియు బయటనున్న పలు రకాల జబ్బులను మటుమాయం చేస్తుంది. యోగాసనాలు చేస్తుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి కూడా తగ్గి జీవితం సాఫీగా సాగిపోతుంది. దీంతో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
యోగాసనాలు మన దేశంలో అతి పురాతనమైన వ్యాయామం. దీనిని ఇప్పటికీ మనలో చాలామంది పాటిస్తున్నారు.
విషయం ఏంటంటే ప్రస్తుతం యోగాసనాలను సులభంగా చేసే విధానంతోపాటు శాస్త్రపరమైన సిద్ధాంతాలను కూడా జోడించారు. యోగాసనాల్లో ఆదునిక విజ్ఞానాన్ని కలిపి ఇప్పుడు చాలామంది ప్రయోగిస్తున్నారు.
ప్రస్తుతం యోగాసనాలు చేసే వారు చాలామంది ఉన్నారని యోగా గురువులు అంటున్నారు. చాలామంది నిత్యం యోగాసనాలు చేసి తమ జీవితాలను ఆరోగ్యమయం చేసుకుంటున్నారని వారు తెలిపారు.